ప్రతి ఏటా ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

10-05-2019 Fri 15:56 | Andhra
  • ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతాం
  • గత ఏడాది ఏపీఎస్ ఆర్టీసీకి రూ.1,205 కోట్ల నష్టం  
  • ఆర్టీసీకి కిలోమీటర్ కు రూ.6.53 నష్టం వస్తోంది
గత ఏడాది ఏపీఎస్ ఆర్టీసీకి రూ.1,205 కోట్ల నష్టం వచ్చిందని, ఆర్టీసీకి కిలోమీటర్ కు రూ.6.53 నష్టం వస్తోందని ఎండీ సురేంద్రబాబు చెప్పారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆర్టీసీకి రూ.6,455 కోట్ల అప్పు ఉందని, డీజిల్ ధరల పెరుగుదల, సిబ్బంది వేతనాల వల్ల నష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. డీజిల్ ధరల వల్ల ఆర్టీసీకి ఏటా రూ.600 కోట్ల నష్టం వస్తోందని, ఎంవీ ట్యాక్స్ ల రూపంలో ఆర్టీసీ ఏటా రూ.1,409 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. 2018-19లో ఆర్టీసీ 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించిందని, అంతర్గత పొదుపు చర్యల ద్వారా ఆదాయం పెంచుకున్నట్టు చెప్పారు. 2018-19లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ.554 కోట్ల సాయం అందిందని అన్నారు.

ఆర్టీసీకి రూ.250 కోట్లు కావాలి

కొత్తగా వెయ్యి బస్సులు ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీకి రూ.250 కోట్లు కావాలని, కొత్త బస్సులు, పాత బస్సుల మార్పు కోసం రూ.666 కోట్లు అవసరం ఉందని సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కేటాయిస్తున్న నిధులు మరింత పెంచాలని, 2019-20 బడ్జెట్ లో రూ.3,717 కోట్ల సాయం చేయాలని కోరినట్టు చెప్పారు. ఎంవీ ట్యాక్స్ మినహాయింపు, పల్లె వెలుగు బస్సులపై వచ్చే నష్టాలను భరించాలని కోరారు. డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రతి ఏటా 30 శాతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి త్వరలో పంపుతామని చెప్పారు. ఆర్టీసీలో ఏ ఉద్యోగిని తొలగించమని ఈ సంద్భంగా సురేంద్ర బాబు స్పష్టం చేశారు.
Andhra Pradeshapsrtcmdsurendra babau

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more